ధిక్కార కవి మద్దూరి నగేష్ బాబు వర్థంతి సందర్భంగా జనవరి 10న ప్రతి సంవత్సరం కవిత్వానికి పురస్కారాలు ఇవ్వదలిచాము. ప్రధాన పురస్కారానికి 5 వేలు, మరో మూడు ప్రోత్సాహక పురస్కారాలకు వేయి చొప్పున నగదు, జ్ఞాపిక, సత్కారం ఉంటాయి. ఆసక్తి వున్న కవులు 2020 - 22 సంవత్సరాల మధ్య ప్రచురించిన తమ కవితా సంపుటాలను 4 కాపీలు డిసెంబర్ 20లోగా కన్వీనర్, తంగిరాల సోని, డోర్ నెం, 12-45/1, జెడ్పీ హైస్కూలు దగ్గర, కంచికచర్ల, ఎన్టీఆర్ జిల్లా. పిన్ : 521 180. చిరునామాకు పంపాలి. జనవరి 10న విజయవాడలో పురస్కార ప్రదాన సభ ఉంటుంది. వివరాలకు : తంగిరాల సోని, 96766 09234.










