హైదరాబాద్ : అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఎంఎస్‌ఎన్ గ్రూపు బయోఈక్వలెంట్ జనరిక్ వెర్షన్ అయిన ఫెసొబిగ్‌ను ఆవిష్కరించింది. బుధవారం దీన్ని హైదరాబాద్‌లో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరత్ రెడ్డి విడుదల చేశారు. ఓవరాక్టివ్ బ్లాడర్ (ఒఎబి), యూరినరీ ఇన్‌కాంటినెన్స్ చికిత్స కోసం వివిధ అంతర్జాతీయ చికిత్స మార్గదర్శకాల ద్వారా అత్యంత సురక్షిత, వినూత్నత ఫస్ట్ లైన్ ఫార్మాకోథెరపీ ఎంపికగా ఈ ఔషధం సిఫారసు చేయబడిందని భరత్ రెడ్డి తెలిపారు. ''ఫెసొబింగ్ టాబ్లెట్‌ల ఆవిష్కారం భారతీయ రోగుల బాధలను తగ్గించడానికి క్లిష్టమైన చికిత్సలలో సరసమైన మందులను తీసుకురావడానికి పరిశోధన చేయడానికి మా కొనసాగుతున్న నిబద్ధతకు అను గుణంగా ఉంది'' అని భరత్ రెడ్డి పేర్కొన్నారు.










