Jun 13,2023 21:40
  • భారత స్టాక్‌ మార్కెట్‌లో రికార్డ్‌

ముంబయి : ప్రముఖ టైర్ల తయారీ కంపనీ ఎంఆర్‌ఎఫ్‌ ఒక్క షేర్‌ ధర అక్షరాల లక్ష రూపాయలు పలికింది. మంగళవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో ఓ దశలో ఎంఆర్‌ఎఫ్‌ షేర్‌ ధర రూ.1,00,435.95కు చేరి నూతన రికార్డ్‌ను సృష్టించింది. భారత్‌లో రూ.1లక్ష మార్క్‌ అందుకున్న తొలి స్టాక్‌గా ఎంఆర్‌ఎఫ్‌ నిలిచింది. ఉదయం రూ.99,150 వద్ద ప్రారంభమైన సూచీ తుదకు రూ.99,950.65 వద్ద ముగిసింది. 2023లో ఇప్పటి వరకు ఈ షేర్‌ 13 శాతం పెరగ్గా.. ఏడాది వ్యవధిలో 46 శాతం ఎగిసింది. కాగా.. గడిచిన ఏడాది కాలంలో సెన్సెక్స్‌ 20 శాతం మాత్రమే పెరిగింది. ఏడాదికేడాదితో పోల్చితే 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎంఆర్‌ఎఫ్‌ నికర లాభాలు 86 శాతం వృద్థితో రూ.313.53 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు కంపెనీ షేర్ల ర్యాలీకి దోహదం చేశాయి. చెన్నరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ షేర్‌ 2012లో తొలిసారి రూ.10 వేల మార్క్‌ను చేరింది.