ప్రజాశక్తి-టెక్కలిరూరల్(శ్రీకాకుళం) : టెక్కలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నుండి టెక్కలి వైస్ ఎంపీపీ మన్నేల కిషోర్‌తో పాటు టెక్కలి ఎంపీటీసీలు సమావేశాన్ని శనివారం బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు తమకు సమాచారం లేకుండా నిర్వహిస్తూ ప్రోటోకాల్ పాటించడంలేదని కొన్ని ప్రాదేశికాలు అభివృద్ధి పనులు జరగడం లేదని ఆరోపిస్తూ ఎంపీటీసీలు సమావేశాన్ని బాయికాట్ చేశారు. అనంతరం మీడియాతో మున్నెల కిషోర్ మాట్లాడుతూ..మండల పరిషత్తు నిధులు దుర్వినియోగం జరిగాయన్నారు దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కొంతమంది ఎంపీటీసీలకే నిధులు ప్రాదేశికలో మంజూరు చేశారని మిగతా ఎంపీటీసీలు ఎందుకు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2021 బాడీ నుండి జనరల్ ఫండ్ 3 కోట్ల 58 లక్షల 15 ఫైనాన్స్ 98 లక్షలు మొత్తం 4 కోట్ల 56 లక్షలు నిధుల ఎంపీటీసీ తెలియకుండా ఖర్చు చేశారని కొంతమంది ఎంపీటీసీలకు నిధులు కూడా కేటాయించలేదని ఎందుకు ఇంత వివక్షత చూపుతున్నారన్నారు. ఎంపీటీసీ వాకాడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పరిషత్తు నిధుల నుండి నాలుగు బోర్లు మంజూరు చేయిస్తే జిల్లా పరిషత్ నిధులు నువ్వెలా ఖర్చు చేస్తామని స్థానిక గొల్ల వీధిలో బోరు వేస్తుంటే జడ్పిటిసి దువ్వాడ వాణి నిలుపుదల చేశారని మండల పరిషత్ నిధులు నువ్వెలా పంచిపెడతారుని ప్రశ్నించారు. ఎంపీటీసీ అందరూ ప్రాదేశికలోకి వెళ్లలేకపోతున్నామని ఎక్కడ సమస్యలు అక్కడే వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు దృష్టి పెట్టి పరిస్థితి చక్కదిద్దాలన్నారు. కూన పార్వతి పీత హేమలత, పోలాకి పాల్గణరావు, యర్ర సుజాత, బసవల సంధ్యారాణి చింతాడ శ్రీలత తదితరులు ఉన్నారు.










