Mar 12,2023 15:42

ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు అధికారులు అందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణ అన్నారు. ఆదివారం చీరాల ఎన్‌.ఆర్‌.పి.ఎం హైస్కూలో ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల13వ తేదీన జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ పోలింగ్‌ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ పోలింగ్‌ సమయంలో అనుమానాలు వస్తే వ్రాత పూర్వంగా తెలియజేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల్లో పిఓలు తప్పకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలన్నారు. పోలింగ్‌ అనంతరం పోలింగ్‌ కేంద్రాల నుండి రూట్‌ ఆఫీసర్లు సహాయంతో పోలింగ్‌ సామగ్రిని రిసెప్షన్‌ కేంద్రానికి తీసుకురావాలని కలెక్టర్‌ చెప్పారు.రిసెప్షన్‌ కేంద్రాల వద్ద ఎన్నికల సామాగ్రి పూర్తిగా అప్పగించిన తరువాత మాత్రమే వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి కె.లక్ష్మీ శివ జ్యోతి, చీరాల రెవెన్యూ డివిజనల్‌ అధికారి సరోజిని, బాపట్ల రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్ర, ఎన్నికల ప్రెసిడింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.