Feb 15,2023 12:04

నందిగామ టౌన్‌ (ఎన్‌టిఆర్‌) : చందర్లపాడు మండలంలోని తుర్లపాడు గ్రామంలో పెరమసాని పున్నయ్య మృతి చెందడంతో శాసనసభ్యులు డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌ రావు బుధవారం పున్నయ్య భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.