రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు శంకుస్థాపన
ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ మండలంలోని కేతవీరునిపాడు గ్రామం నుండి కంచల గ్రామానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల సుందరమ్మ, మండల కన్వీనర్ నెలకుదుటి శివ నాగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ గోనెల సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.










