Oct 03,2023 15:51

ప్రజాశక్తి-పెనుమంట్ర(పశ్చిమగోదావరి) : పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు రూ7.5 కోట్ల విలువైన అభివద్ధి , శంకుస్థాపన , ప్రారంభోత్సవం చేశారు. తొలుత ఆలమూరులో హెల్త్‌ క్లినిక్‌ (ఎన్సీసీ) ప్రారంభోత్సవం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, కొయ్యేటిపాడులో హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌, సిసి రోడ్స్‌, రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం. సత్యవరంలో సచివాలయం ప్రారంభోత్సవం. నెగ్గిపూడిలో రైతు భరోసా కేంద్రం, ప్రారంభోత్సవం.వెలగలేరు, మార్టేరు, కోడేరు, పాలకొల్లు రోడ్డులో బస్సు షెల్డర్‌ ప్రారంభోత్సవం కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులు ఉభయగోదావరి జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌, రాజంపేట ఎంపీ పార్లమెంట్‌ మిథున్‌ రెడ్డి ,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, వంకా రవీంద్రనాథ్‌, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, నియోజకవర్గ పరిశీలికరాలు , రాజమండ్రి రూడా చైర్‌ పర్సన్‌ మేడపాటి షర్మిల రెడ్డి , ఆయా గ్రామాల సర్పంచ్‌ లు మేడపరెడ్డి వెంకట రమణ, కర్రి ముని రామకష్ణారెడ్డి, కొవ్వూరి మధువాణి, మట్టా కుమారి, మామిడిశెట్టి ధనలక్ష్మి, ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి), జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, ఏఎంసీ చైర్మన్‌ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ ), నాయకులు , ఆయా శాఖల అధికారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.