హైదరాబాద్ : ఎంజి మోటార్ ఇండియా తన స్మార్ట్ ఇవి అయిన 'కోమెట్' ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో దీన్ని తయారీ ప్రక్రియను చేపట్టినట్ల్లు పేర్కొంది. ప్రపంచ మార్కెట్‌లో ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు తెలిపింది. ''భారత్‌లో ఎంజి కోమెట్‌తో ఆచరణాత్మక అర్బన్ విద్యుత్ వాహనాన్ని అందజేస్తాము. ఉత్పాదనా శ్రేణీలో బయటికి వస్తున్న మొదటి కోమెట్‌తో మేము దేశానికి ఒక కొత్త విద్యుత్ వాహన భవిష్యత్తు ప్రారంభానికి స్వాగతం పలకడానికి సంతోషంగా ఉన్నాము.'' అని ఎంజి మోటార్ ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజూ బాలేంద్రన్ పేర్కొన్నారు.










