Oct 04,2023 21:22

ముంబయి : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ లూపిన్‌ డయాబెటిస్‌ రోగులకు మద్దతును అందిస్తున్నట్లు తెలిపింది. పేషెంట్‌ సపోర్ట్‌ ప్రోగ్రాం 'హమ్‌రహి' పేరుతో మధుమేహం నిర్వహణలో నూతన శకానికి నాంది పలుకుతున్నట్లు పేర్కొంది. దేశంలో 7.7 కోట్ల మంది మధుమేహం భారిన పడ్డారని తెలిపింది. 2045 నాటికి ఇది 13.4 కోట్ల కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. హమ్‌రహిలో ప్రోగ్రాంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల మార్గదర్శకత్వంలో వ్యక్తిగతీకరించిన (కస్టమైజ్డ్‌) డైట్‌ కౌన్సెలింగ్‌, మందుల సహాయం తదితర మద్దతును అందించనున్నట్లు పేర్కొంది. రోగులకు ఖచ్చితమైన ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌, నైపుణ్యాలను అందించడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని పేర్కొంది. ఇందుకోసం తమ టోల్‌ఫ్రీ నెంబర్‌, కస్టమర్‌ కేర్‌ను సంప్రదించవచ్చని లుపిన్‌ ప్రెసిడెంట్‌ ఇండియా రీజియన్‌ ఫార్ములేషన్స్‌ రాజీవ్‌ సిబల్‌ తెలిపారు.