వర్షాకాలంలో విరివిగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. దీనిలో రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది.
- సీతాఫలం గుజ్జులో 94 క్యాలరీల శక్తి, 20-25గ్రా|| పిండిపదార్థాలు, 2.5గ్రా|| ప్రొటీన్లు, 4.4గ్రా|| పీచూ లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్, థైమీన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి వంటి విటమిన్లు అధికంగా లభిస్తాయి.
- సీతాఫలంలో కాల్షియం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.
- ఈ పండులో ఉన్న లుటీన్, జియాజాన్థిన్ విటమిన్లు వయసుతో పాటు వచ్చే కళ్ళకు సంబంధించిన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది
- దీనిలో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సంభందించిన సమస్యలను తొలగిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
- సీతాఫలంలో ఉండే ఫ్లేవనాయిడ్స్ వివిధ రకాల క్యాన్సర్‌ల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
- సీతాఫలంలో పండు ఒక మంచి యాంటియాక్సిడెంట్. మన శరీరాన్ని నష్టపరిచే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
- ఒక 100 గ్రాముల సీతాఫలం పండులో మన శరీరానికి ఒక రోజుకి కావాల్సిన విటమిన్ బి6 పోషక విలువలు ఉంటాయి. ఇవి అల్జీమర్స్ వ్యాదిని తగ్గిస్తోంది.
- దీనిలో ఉన్న విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి దోహదపడుతుంది.
- గర్భిణీలకు మంచి ఆహారం. ఇందులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ రక్తహీనత రాకుండా కాపాడతాయి.
- సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ కాలంలో వచ్చే డయేరియా సమస్యను నిలువరిస్తుంది.