Oct 24,2023 11:15

చెన్నై : చెన్నైలోని ఆవడి వద్ద ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (ఈఎంయూ)కి చెందిన లోకల్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం అన్ననూర్‌ వర్క్‌షాప్‌ నుండి ఆవడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 4 కోచ్‌లు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోకో ఫైలెట్‌ అస్వస్థత గురి అవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తాత్కాలికంగా తిరువళ్ళూరు రూట్‌ లోకల్‌ ట్రైన్స్‌ రైల్వే అధికారులు నిలిపివేశారు.