కాకినాడ: విశాఖ-తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా కలకలం చెలరేగింది. తుని స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగీలో బాణసంచా పేలి పొగలు, శబ్దం వచ్చాయి. పేలుళ్లతో ప్రయాణికులు ఆందోళన చెందారు. బాణసంచాను ప్రయాణికులు కాళ్లతో బయటకు తీసేశారు. చైన్ లాగి రైలును నిలిపివేశారు. రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రైలు బయలుదేరిన తర్వాత మరోసారి రైలు నిలిపివేసి తనిఖీలు చేశారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో తుని నుంచి రైలు గమ్యస్థానానికి బయలుదేరింది.