లేఆఫ్‌ల బాటలో .. ప్రపంచవ్యాప్తంగా మహా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను ఇళ్లకు పంపేస్తున్నాయి. డెల్, పేపాల్, గూగుల్, అమెజాన్, జొమాటో, ఇంటెల్ ఇలా ఎన్నో కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకోవటానికి ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోత..!
ఈ లేఆఫ్‌ల దెబ్బ మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్‌వర్క్ లింక్డిన్‌కు కూడా తగిలింది. తాజాగా.. 716 మందికి పింక్ స్లిప్‌లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్ అప్లికేషన్‌ను షట్‌డౌన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 3.5 శాతం మందిని ఉద్యోగాల నుండి తొలగించింది..! లింక్డిన్ గత సంవత్సరంలోని ప్రతి త్రైమాసికంలో ఆదాయాన్ని గడించింది. కానీ, దాని మాతృసంస్థ మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్‌ను కొనసాగిస్తుంది. లింక్డిన్‌లో దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోతలకు దారి తీసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా 6 నెలల్లో 2,70,000కి పైగా ఐటీ ఉద్యోగులు తొలగింపు..!
ప్రపంచవ్యాప్తంగా గత ఆరు నెలల్లో 2,70,000కి పైగా ఐటీ ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్ మాతఅ సంస్థ ఆల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థ ఉద్యోగాల కోతపెట్టింది. 2016లో లింక్డిన్ 26 బిలియన్లకు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్, ఇటీవలి కాలంలో దాదాపు 10,000 ఉద్యోగులను తొలగించి ఇళ్లకు పంపిన సంగతి విదితమే..!
మైక్రోసాఫ్ట్‌లో కూడా...!
ఆర్ధిక ఆనిశ్చితి, డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో సప్లయి చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఉపాధి కోల్పోయారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్, మెటా, గూగుల్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులపై వేటు వేయడంతో వారంతా ఇళ్ల బాటపట్టారు. గత ఏడాది చివరి నుంచి మెటా 21,000 మందిని ఉద్యోగాల్లో నుండి తొలగించింది. జనవరి 2023లో గూగుల్ 12,000 మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అమెజాన్ ఇప్పటివరకు రెండు దఫాలుగా 27,000 మందిని తొలగించడం ఉద్యోగుల్లో ఆందోళనలకు దారి తీసింది. టెక్ పరిశ్రమలో చాలా మంది తొలగింపులు కంపెనీ ఆర్థిక స్థితికి కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న సంస్థల నుండి దిగ్గజ సంస్థల వరకు ఉద్యోగులపై వేటు వేస్తుండటంతో లక్షలాదిమంది ఉద్యోగులు నిరుద్యోగులై ఉపాధి కోల్పోతూ ఉసూరుమంటున్నారు..!










