May 12,2023 21:28

శాన్‌ఫ్రాన్సిస్కో : సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా లిండా యాకరినో నియమితులు కానున్నారని రిపోర్ట్‌లు వస్తోన్నాయి. ట్విట్టర్‌కు ఓ మహిళను బాస్‌గా తీసుకురానున్నామని ప్రస్తుత సిఇఒ ఎలన్‌ మస్క్‌ తెలిపారు. అయితే మస్క్‌ ఆమె పేరు చెప్పకపోయినప్పటికీ.. మీడియాలో యాకరినో పేరు చక్కర్లు కొడుతోంది. యాకరినో ప్రస్తుతం ఎన్‌బిసి యూనివర్సల్‌లో అడ్వర్టజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమెతో మస్క్‌కు ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. తనతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.