- హార్దిక్, ఇషాన్ అర్ధసెంచరీలు
- టీమిండియా 266ఆలౌట్
- భారత్-పాక్ మ్యాచ్ రద్దు
- ఇరుజట్లకు చెరో పాయింట్
పల్లెకెలె : భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచాడు. భారతజట్టు ఇన్నింగ్స్ ఆరంభించినప్పుడు కొంతసేపు అడ్డంకిగా నిలిచిన వరుణుడు, టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మరోసారి ఆటంకపరిచాడు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు పాకిస్తాన్ పేసర్ల ధాటికి 266పరుగులకే ఆలౌటైంది. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(10), విరాట్ కోహ్లీ(4), శ్రేయస్ అయ్యర్(14) నిరాశపరిచారు. దీంతో టీమిండియా 66పరుగులకే టాపార్డర్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇషన్ కిషాన్, హార్దిక్ పాండ్యా చేపట్టారు. షాదాబ్ ఖాన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీయడంతో ఇషాన్ కిషన్ 54బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుచేశాడు. ఆ తర్వాత సెంచరీ దిశగా వెళ్తున్న ఇషాన్‌ను పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ 38వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమిండియా 204 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత స్కోర్ పెంచే బాధ్యతను హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. షాహీన్ అఫ్రిది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి అఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి పాండ్యా పెవిలియన్ దారి పట్టడా.. అదే ఓవర్ చివరి బంతికి రవీంద్ర జడేజా కూడా ఔటయ్యాడు. ఆ వెంటనే శార్దూల్ ఠాకూర్ ఇలా ఒక్కొక్కరు పెవీలియన్ బాట పట్టారు. దీంతో టీమిండియా కనీసం 250పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది.

10కి పది పేసర్లకే..
పాకిస్తాన్ పేసర్లు భారత్‌పై రాణించారు. భారత్‌తో జరిగిన పోరులో 10కి పది వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. నాణ్యమైన పేస్‌ను ఎదుర్కోవడం టీమిండియాకు కష్టమే అని మ్యాచ్‌కు ముందు నుంచే మాజీలు పేర్కొన్నట్లే జరిగింది. వర్షం అంతరాయం మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ పేసర్లు అదరగొట్టారు. ప్రపంచంలో తమది అత్యుత్తమ పేస్ త్రయం ఎలా అయిందో పల్లెకెలెలో చూపించారు. తొలి స్పెల్‌లో నిప్పులు చెరిగిన షాహీన్ షా అఫ్రిది.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తొలుత వెనక్కి పంపాడు. ఆ తర్వాత జడేజా, పాండ్యాలను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. షాహిన్ అఫ్రిది(4/35), నసీమ్ షా(3/36), రవూఫ్(3/56) పది వికెట్లు కూల్చారు. స్టార్ స్పిన్నర్ షాదాబ్, నవాజ్ నిరాశపరిచారు.
స్కోర్‌బోర్డు..
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి)షాహిన్ అఫ్రిది 11, శుభ్‌మన్ (బి) రవూఫ్ 10, కోహ్లి (బి)షాహిన్ అఫ్రిది 4, శ్రేయస్ అయ్యర్ (సి)ఫకర్ (బి)రవూఫ్ 14, ఇషాన్ (సి)బాబర్ (బి)రవూఫ్ 82, హార్దిక్ (సి)అఘా సల్మాన్ (బి)షాహిన్ షా 87, జడేజా (సి)రిజ్వాన్ (బి)షాహిన్ షా 14, శార్దూల్ (సి)షాదాబ్ (బి)నసీమ్ షా 3, కుల్దీప్ (సి)రిజ్వాన్ (బి)నసీమ్ షా 4, బుమ్రా (సి)అఘా సల్మాన్ (బి)నసీమ్ షా 16, సిరాజ్ (నాటౌట్) 1, అదనం 20. (48.5 ఓవర్లలో ఆలౌట్) 266పరుగులు. వికెట్ల పతనం: 1/15, 2/27, 3/48, 4/66, 5/204, 6/230, 7/242, 8/242, 9/261, 10/266 బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10-2-35-4, నసీమ్ 8.5-0-36-3, రవూఫ్ 9-0-58-3, షాదాబ్ 9-0-57-0, నవాజ్ 8-0-55-0, అఘా సల్మాన్ 4-0-21-0.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. శనివారం పల్లెకెలె వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. టీమిండియా ఇన్నింగ్స్‌కు తొలుత రెండుసార్లు ఆటంకపరిచిన వరుణుడు.. ఇన్నింగ్స్ ముగిశాక ఇక అవకాశమివ్వలేదు. దీంతో పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు అవకాశమే దక్కలేదు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు భారతజట్టు 48.4ఓవర్లలో 266పరుగులకు కుప్పకూలింది. ఇషాన్(82), హార్దిక్(86) టాప్ స్కోరర్స్. పాక్ బౌలర్లు షాహిన్ అఫ్రిది(4/35), నసీమ్(3/36), రవూఫ్(3/58) బౌలింగ్‌లో మెరిసారు.










