
విశాఖపట్నం : తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ, తదితర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. బుధ, గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులుపడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. పిడుగులు పడే ప్రమాదమూ ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.