Jun 01,2023 14:59

హైదరాబాద్‌: బావిలో ఈతకు దిగి ఓ వ్యక్తి  మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. మృతుడిని ఎల్బీనగర్‌కు చెందిన రజాక్‌గా గుర్తించారు. రజాక్‌ మునిగిపోతుండగా అక్కడున్న కొందరు మొబైల్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రజాక్‌ మఅతదేహం కోసం డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది గురువారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. మధ్యాహ్నానికి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.