
ప్రజాశక్తి-పేరుపాలెం(పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం పేరుపాలెం విహారయాత్రకు వెళ్లిన నలుగురు సముద్ర స్నానానికి దిగారు. వీరిలో ముగ్గురు గల్లంతవ్వగా ఒకరిని స్థానికులు కాపాడారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. తణుకు పరిసర ప్రాంతాల నుంచి నలుగురు వ్యక్తులు ఆదివారం పేరుపాలెం బీచ్ సందర్శనార్ధం వెళ్లారు. అయితే వీరు సముద్ర స్నానానికి బీచ్‌లో దిగడంతో అలలకు కొట్టుకుపోయారు. వీరిన గమనించిన స్థానికులు ఒక వ్యక్తిని కాపాడగా మరో ముగ్గురు అలల ధాటికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సాహాయక చర్యలు చేపట్టారు.