Sep 23,2023 16:43

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో ఓ బాలుడు (17) దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి దుండుగులు సముద్రంలో పడేశారు. సంఘటనాస్థలిని వన్‌టౌన్‌ పోలీసులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.