బీజింగ్ : ఆసియా గేమ్స్‌లో భారత్ తన సత్తా చాటుతోంది. తాజాగా మంగళవారం పురుషుల 4 ఞ100 మీటర్ల స్విమ్మింగ్‌లో మెడ్లీ బృందం జాతీయ రికార్డును బద్దలు కొట్టి ఫైనల్‌కు చేరింది. శ్రీహరి నటరాజ్, లిఖిత్ సెల్వరాజ్, సజన్ ప్రకాష్, తనీష్ జార్జ్ మాథ్యూలు 3 :44.84 నిమిషాల్లో పూర్తి చేశారు. జకార్తాలో జరిగిన గత ఆసియా గేమ్స్‌లో వారు నటరాజ్, సందీప్ సెజ్వాల్, ప్రకాష్, ఆరోన్ డిసౌజా నెలకొల్పిన 3:44.94 జాతీయ రికార్డును బద్దలు కొట్టి నూతన రికార్డును సృష్టించారు. బుధవారం ఫైనల్స్ జరగనున్నాయి.










