ముంబయి: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్ భారతజట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా డబ్ల్యుటిసి ఫైనల్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్ చోటు కల్పిస్తున్నట్లు బిసిసిఐ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 'కేఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉన్న కారణంగా అతడు డబ్ల్యుటిసి ఫైనల్‌నాటికి కోలుకొనే ఛాన్స్ లేదని, అందుకే ముందుగా అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కు చోటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. అలాగే డబ్ల్యుటిసి భారతజట్టులో చోటు దక్కించుకున్న ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్ కూడా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారని, వారిద్దరి ఫిట్‌నెస్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ ప్రకటనలో తెలిపింది. నెట్స్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తూ.. ఉనాద్కట్ తీవ్రంగా గాయపడ్డాడని, ఉమేశ్ గాయం తీవ్రత పెద్దగా లేనందున అతడు కోలుకొనే అవకాశమున్నట్లు పేర్కొంది.










