ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2019 నుంచి దాదాపు రెండు సంవత్సరాలు బాల సాహిత్యం కోసం స్థానీయత ప్రధాన అంశంగా బాలసాహిత్యం రాయడం జరిగింది. చరిత్ర, ఆచార వ్యవహారాలు, చారిత్రక కట్టడాలు, పౌరాణిక స్థలాలు, గొప్ప వ్యక్తులు, ఆహార పానీయాలు, నదులు, సరస్సులు మొదలైన అంశాలలో జిల్లాల వారీగా పాఠశాల విద్యార్థుల కోసం రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రెండు వర్క్ షాపులు నిర్వహించడం జరిగింది. ప్రతి జిల్లాలోని బాల సాహిత్య రచయితలు ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను ఎన్నో కష్టనష్టాలకోర్చి కరోనా కాలంలోనూ కథల రూపంలో రాయడం జరిగింది. అయితే పాఠశాల విద్యార్థులకు ఉపయుక్తమైన ఈ స్థానిక కథలను సమగ్ర శిక్ష ఇంతవరకు ప్రచురణకు చేపట్టలేదు. సొంత ఖర్చులతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కరోనా కాలానికి కూడా భయపడకుండా రెండు వర్క్ షాప్‌లకు తమ సొంత ఖర్చులతో హాజరైన రచయితలకు ఎలాంటి చెల్లింపులు జరపలేదు. అద్భుతమైన ఈ స్థానిక కథలను జిల్లాల వారీగా మేమే ప్రచురించుకుంటాం అని వివిధ జిల్లాల నుంచి రచయితలు సిద్ధమవుతున్నారు. కాబట్టి అద్భుతమైన ఈ స్థానిక చరిత్రలను అన్ని జిల్లాల రచయిలం మనమే ప్రచురించుకొని పాఠశాల విద్యార్థులకు చరిత్ర పరిశోధకులకు అందుబాటులోకి తీసుకువద్దాం.
- మంచికంటి, కధారచయిత
రాష్ట్ర బాల సాహిత్య కోఆర్డినేటర్, 9949535695










