Apr 22,2023 13:24

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : ఏ నాటికైనా కమ్యూనిజమే ప్రపంచానికి ప్రత్యామ్నాయం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. శనివారం లెనిన్‌ జయంతి సందర్బంగా ... స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ... ప్రపంచ కార్మిక వర్గ మహానేత, కమ్యూనిస్టు సిద్ధాంత కర్త, సోవియట్‌ రాజ్య నిర్మాత లెనిన్‌ అని అన్నారు. కమ్యూనిస్టులకు, ప్రగతిశీల శక్తులకు చాలా సుపరిచితమైన వ్యక్తి లెనిన్‌ అన్నారు. ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతానికి, మార్క్స్‌ ,ఎంగెల్స్‌ తరువాత లెనిన్‌ విశేషమైన కృషి చేశారన్నారు. మార్క్స్‌, ఎంగెల్స్‌ రచించిన ప్రాపంచిక సిద్ధాంతాన్ని ప్రపంచ పరిస్థితులకు అనువర్తింపచేయడం, ప్రత్యేకంగా నాటి జారిష్టు రష్యా కి అనువర్తింపచేయడంలో అసమాన ప్రజ్ఞ చెప్పారన్నారు. విశేషమైన అధ్యయనమే కాకుండా, ఆచరణలో రష్యా వంటి సువిశాల దేశంలో మార్క్సిజాన్ని అనువర్తింపచేసి ఆ దేశంలో విప్లవం జయప్రదం చేశారన్నారు. ప్రపంచంలో తొలి కార్మిక రాజ్యాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. అందుకే సిద్ధాంతం - ఆచరణ అనేవి రెండూ విడదీయరాని అంశాలన్నారు. వీటిలో లెనిన్‌ బహుముఖ మేధావి, ప్రజ్ఞాశాలి అన్నారు. కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో మొదట లెనిన్‌ ఉన్నారన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి, నిర్మాణ పార్టీ సూత్రాలు, రూపొందించడంలో లెనిన్‌ కఅషి ప్రధానమైందన్నారు . వీటినే ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలు అనుసరిస్తున్నాయన్నారు. నాడు పెట్టుబడిదారీ విధానం విస్తరిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారీ సమాజం అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనే విషయాన్ని లెనిన్‌ మొదట తెలిపారన్నారు. ఆ సమయంలో ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరిగాయన్నారు. సామ్రాజ్యవాదం అంటే ఏమిటి, విప్లవాలు ఎలా జయప్రదం చేయాలి అనే రచనలు చేశారన్నారు. ఒక దేశంలో విప్లవం ఎలా సాధ్యమవుతుంది, విప్లవాన్ని ఎలా సాధ్యం చేయగలం, విప్లవానంతరం రాజ్యం పట్ల ఎలా ఉండాలి, రాజ్యాంగం స్వభావం, రాజ్యాంగం యంత్రాంగం గూర్చి రాజ్యం- విప్లవం అనే గొప్ప రచనలు ఆయన చేశారన్నారు. కమ్యూనిస్టులకు అన్నింటికన్నా ముఖ్యమైన ప్రాథమికమైనది ''ఏం చేయాలి'' అనే రచన మనకందరికీ పేద బాలశిక్ష వంటిదన్నారు. నేటికీ కమ్యూనిస్టు నిర్మాణంలో ఆ పుస్తకం ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. నేటికీ ఆ పని పద్ధతులనే మనం అనుసరిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీని మరింత అభివఅద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు.

అనంతరం జిల్లా కార్యదర్శి బి. బలరాం మాట్లాడుతూ ... కమ్యూనిస్టు ఉద్యమానికి లెనిన్‌ చేసిన కఅషి మరువలేనిదన్నారు. ప్రపంచ కార్మిక వర్గ రాజ్య నిర్మాణంలో నేటి కమ్యూనిస్టులందరికీ లెనిన్‌ స్ఫూర్తిదాయకమన్నారు. మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌ రచించిన కమ్యూనిస్టు సిద్ధాంతం నేటికీ ఆచరణీయం, ఆమోదయోగ్యమన్నారు. ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కమ్యూనిజమే పరిష్కారమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె ఎన్‌ వి గోపాలన్‌, చింతకాయల బాబురావు, పీవీ. ప్రతాప్‌, కర్రి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు కె. రాజారామ్మోహన్‌ రారు, జె.సత్యనారాయణ, ఎం. రామాంజనేయులు, డి.పెద్దిరాజు పాల్గొన్నారు.