Sep 16,2023 20:29

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సిఐటియు జాతీయ మాజీ కార్యదర్శి కనయ్ బెనర్జీ మృతి కార్మిక ఉద్యమానికి తీరనిలోటని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నరసింగరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిఐటియు ఆలిండియా కేంద్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన బీడీ రంగంతోపాటు వివిధ కార్మికోద్యమాల్లో కీలకపాత్ర పోషించారని తెలిపారు. 1989 నుండి సిఐటియులో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. కార్మికోద్యమంలోనే కాకుండా రైతు, వ్యవసాయ కూలీల మధ్య ఐక్యత కోసం పనిచేశారని, తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.