హైదరాబాద్ : ఔషద ఉత్పత్తుల కంపెనీ లీ ఫార్మా ఉత్పత్తి చేసే కీళ్ల వ్యాధి చికిత్సలో వాడే బయో కార్టిలేజ్ స్మూత్‌వాక్ టాబ్లెట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలో మార్కెట్ చేయడానికి అక్కడి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రివెన్షన్ నుంచి అనుమతులు పొందినట్లు తెలిపింది. ''లీ ఫార్మా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలవనుంది. భారత్‌లో తయారైన ఇటువంటి ఉత్పాదనకు యుఎఇలో ఆమోదం రావడం ఇదే మొదటిసారి. ఈ ఉత్పత్తిని ఆన్ని మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా దేశాలలో విక్రయించేందుకు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. అలాగే మార్కెటింగ్ ఆథరైజేషన్ కోసం యుఎస్ ప్రభుత్వానికి 2024 మూడవ త్రైమాసికంలో దరఖాస్తు చేస్తాము.'' అని లీ ఫార్మా డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. శక్తివంతమైన ఫైటో పోషకాలతో సహజ బయోన్యూట్రాస్యూటికల్స్ ఆధారంగా ఈ ట్యాబ్లెట్లను తయారు చేసినట్లు వెల్లడించారు. మఅదులాస్థిని (కార్టిలేజ్) పెంచి కీళ్లలో కణజాల రుగ్మతలపై ఇది చక్కగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మందు వాడితే సర్జరీలను నివారించవచ్చని లీలా రాణి అన్నారు. దేశీయంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ ఔషదాలు లభ్యం అవుతాయని తెలిపారు.