Sep 27,2023 21:16

న్యూఢిల్లీ : దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా కొత్తగా లావా బ్లేజ్‌ 2 ప్రో 5జిను ఆవిష్కరించింది. బడ్జెట్‌ ధరలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. 8జిబి, 12.జిబి వేరియంట్‌ ధరను రూ.12,499గా నిర్ణయించింది. అక్టోబర్‌ 3 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభం అవుతాయని తెలిపింది. 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపి ప్రధాన కెమెరాతో పాటు ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపి కెమెరాను అమర్చినట్లు పేర్కొంది.