Oct 11,2023 11:03

ఢిల్లీ : మనీలాండరింగ్‌ అంశంలో లావా ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్ట్‌ చేసింది. రాయ్ తో పాటు వివో మొబైల్స్‌ ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను అదుపులోకి తీసుకుంది. వివో మొబైల్స్‌ ఇండియా, గ్రాండ్‌ ప్రాస్పెక్ట్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌ (జిపిఐసిపిఎల్‌)తో సహా 23 అనుబంధ కంపెనీలకు చెందిన 48 ప్రాంతాల్లో ఇడి సోదాలు నిర్వహించింది. జిపిఐసిపిఎల్‌ నేరపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసులో లావా ఎండి అరెస్ట్‌నకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.