న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల కంపెనీ లావా ఇంటర్నేషనల్ కొత్తగా బ్లేజ్ 2 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ధరను రూ.9,999గా, 6జిబి, 128జిబి ధరను రూ.10,999గా నిర్ణయించింది. మూడు రంగుల్లో లభించే ఈ ఫోన్ నవంబర్ 9 నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యం అవుతుందని తెలిపింది. 6.56 అంగుళాల హెచ్‌డి ఫ్లస్ ఐపిఎస్ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో 50 ఎంపి రేర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరాతో విడుదల చేసింది.