న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తన లావా అగ్ని 2ను డిస్కౌంట్‌పై రూ.17,999కే అందిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ పండగ సీజన్ డీల్స్‌లో ఇది లభ్యమవుతుందని ఆ సంస్థ తెలిపింది. అగ్ని 2 ఉత్తమమైన 256జిబి స్టోరేజ్, 16జిబి ర్యామ్ వరకు విస్తరించుకునే సౌలభ్యం ఉందని తెలిపింది. పరిమిత స్టాక్ కొరకు ఈ ఆఫర్ అక్టోబరు 8 నుండి ప్రారంభం అయ్యే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయములో కొనసాగుతుందని తెలిపింది.