Sep 04,2023 20:42

న్యూఢిల్లీ : జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా పాలసీలను అందించే తమ వినూత్న డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ''బీమాకవచ్‌''ను విడుదల చేసినట్లు లార్డ్స్‌ మార్క్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసెస్‌ తెలిపింది. ఇది తాజా సైబర్‌ భద్రతతో ఆడిట్‌ చేయబడిందని పేర్కొంది. సమగ్ర బీమా కవరేజీని కోరుకునే వారికి తమ డిజిటల్‌, రిటైల్‌ విభాగాల ద్వారా వందకు పైగా కార్పొరేట్‌లు, మిలియన్‌ కంటే ఎక్కువ మంది రిటైల్‌ క్లయింట్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ వేదికను రూపొందించడం జరిగిందని తెలిపింది. రిస్క్‌ కవరేజ్‌, ధరల ఆధారంగా వినియోగదారులకు సమాచారం ఇవ్వడానికి సైతం వీలు కల్పిస్తుందని పేర్కొంది.