Oct 04,2023 14:49

మంచిర్యాల: జిల్లాలోని వేములపల్లి మండలం నిల్వాయిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, బుధవారం పులి ఆవు, దూడ మీద దాడి చేసి చంపేసింది. గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులి పాద ముద్రలను పరిశీలించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లద్దని అధికారులు సూచించారు. వీలైనంత తొందరగా పులిని పట్టుకుంటామని వారు తెలిపారు.