
- అసోం నుంచి రైనా కూడా
- అటవీశాఖ ప్రతిపాదనలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పిల్లి జాతిలో పెద్దదైన పూమా ( వీటిని మౌంటైన్ లయన్, కౌగార్, పాంథార్ అని కూడా పిలుస్తారు) లను రాష్ట్రానికి దిగుమతి చేసుకునేరదుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటితోపాటే చిరుతలను కూడా రప్పిరచాలని భావిస్తు న్నారు. రాష్ట్రంలోని జంతు ప్రదర్శనశాలల్లో వీటిని ఉంచాలన్నది అధికారుల ప్రతిపాదన. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చల ప్రక్రియ జరుగుతోంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి జిరాఫీలు, రైనాలను కూడా రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పూమాలు పరిమాణంలో చిరుతల స్థాయిలోనే ఉన్నప్పటికీ, వాటిని పెద్ద పిల్లి జాతిగానే పరిగణిస్తారు. ఇవి అమెరికాలోనే ఎక్కువగా కనిపిరచినప్పటికీ, తరువాత కాలంలో ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెరదుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. మన దేశంలోని కొన్ని జరతుప్రదర్శన శాలల్లో నల్ల పూమా (బ్లాక్ పాంథర్) ఉన్నప్పటికీ, అడవులలో కనిపించవు. అందువల్ల రాష్ట్రంలోని జంతుప్రదర్శనశాలల్లో కూడా వీటిని ఉంచాలన్నది అధికారుల ప్రతిపాదన. చీతాలను కూడా రాష్ట్రంలోని రెరడు ప్రధాన జంతు ప్రదర్శన శాలలకు తీసుకురావాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జంతు ప్రదర్శనశాలలో ఒక జిరాఫీ, ఒక జీబ్రా ఉన్నాయి. వీటికి అదనంగా మరికొన్ని జీబ్రాలు, జిరాఫీలను రప్పిరచాలని యోచిస్తున్నారు. ఇక అసోం నురచి ఒక రైనాను కూడా తెప్పిరచనున్నారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మన రాష్ట్ర సిఎం నుండి లేఖ రాయించాలని భావిస్తున్నారు.