
- ఆశ్చర్యపోతున్న అటవీ అధికారులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఒక పులి 700 కి.మీ మేర ప్రయాణం చేసిన సంఘటన ఇది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఒకటి, రెండు జరిగినట్లు చెబుతున్న అటవీశాఖ అధికారులు ఈ సుదీర్ఘ ప్రయాణాల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కనిపించిన పులి మహారాష్ట్ర నుండి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. తెలంగాణలోని అటవీ ప్రారతం నురచి రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల అటవీ ప్రారతం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, అనంతగిరి, కాకినాడ, విజయనగరం జిల్లాల్లోని అటవీ ప్రారతాల్లో ఈ పులి తిరిగినట్లు గుర్తించారు. అధికారుల నిర్ధారణ ప్రకారం మహారాష్ట్రలోని బ్రహ్మగిరి అటవీ డివిజన్ ప్రాంతం నుండి ఈ పులి వచ్చింది. అయితే, ఇంత దూరం ప్రయాణం చేయడానికి గల కారణాలను మాత్రం అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఖానా అటవీ ప్రారతం నురచి ఒక పులి ఏకంగా నల్లమల అటవీ ప్రారతానికి వచ్చేసిరది. ఆ తరువాత ఇదే పులిని ఖానా ప్రారతంలో గుర్తిరచారు. అరటే రానుపోనూ దాదాపు రెరడు వేల కిలోమీటర్ల దూరం ఈ పులి ప్రయాణిరచినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పులి తన జీవనం కోసం ఒక నిర్ధిష్ట ప్రాంతాన్ని ఎరపికచేసుకుని, దానిని తన అడ్డాగా మార్చుకురటురది. ఆ ప్రారతంలోకి మరే పులి రాకుండా కూడా చూసుకురటురదని అటవీ నిపుణులు చెబుతున్నారు. అయితే పై రెరడు ఘటనల్లో ఒక పరిధి లేకుండా వందల వేల కిలోమీటర్ల దూరం ప్రయాణాలు చేయడం ఆశ్చర్యకమ్రని ఒక అధికారి అన్నారు. పులులు కొత్త కారిడార్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నల్లమల అటవీ ప్రారతంలో మాత్రమే పులులు సంచరిస్తురడగా, తాజాగా ఇతర ప్రారతాలకు కూడా విస్తరిరచే పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.