టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో లక్ష్యసేన్ మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓటమిపాలయ్యాడు. ఉత్కంఠ భరిత సెమీస్‌లో లక్ష్యసేన్ 15-21, 21-13, 16-21తో ఇండోనేషియా షట్లర్ జనాథన్ క్రిస్టీ చేతిలో పోరాడి ఓడాడు. మొదటి గేమ్‌లో ఇద్దరు షట్లర్లు నువ్వా నేనా..? అన్నట్లు తలపడ్డారు. అయితే గేమ్ ఆఖర్లో లక్ష్యసేన్ పట్టు సడలించడంతో 21-15 తేడాతో జనాథన్ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో లక్ష్యసేన్ రెండో గేమ్‌ను కసిగా మొదలుపెట్టాడు. గేమ్ ఆద్యంతం ఎక్కడా జనాథన్‌ను పైచేయి సాధించనీయలేదు. దాంతో 13-21 తేడాతో రెండో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. కానీ మూడో గేమ్‌లో భారత షట్లర్ అదే జోరును కనబర్చలేకపోయాడు. దాంతో ఇండోనేషియా షట్లర్ జనాథన్ 21-16 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాగా, శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్యసేన్ 21-15, 21-19 తేడాతో జపాన్ షట్లర్ కోకి వతనాబే విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
Jonatan Christie 🇮🇩 and Lakshya Sen 🇮🇳 give it their all for a spot in the finals.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/0eSj6ZLOIH
— BWF (@bwfmedia) July 29, 2023










