Mar 12,2023 08:33

గోడ మీద పిల్లులు
గుంభనంగా ఉన్నాయి
ఎన్నికల సమయంలో
ఎటువైపు దూకాలా అని.
ఊసర వెల్లులు
స్తబ్థుగా ఉన్నాయి
ఎన్నికల తరుణంలో
ఏ రంగు మార్చాలా అని.
మేక వన్నెపులులు
మౌనంగా ఉన్నాయి
ఎన్నికల తరువాత
ఏ స్వభావాన్ని చూపాలా అని.
కూలి ఈగలు
పని చేసుకుని పోతున్నాయి
గెలుపు, ఓటములు
ఓటరు దేవుడే నిర్ణయిస్తాడని.

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌ : 7780277240