Mar 24,2023 21:02

రుణ, ఈక్విటీలపై పరిమితి యోచన
న్యూఢిల్లీ : అదాని గ్రూపు కంపెనీల్లో భారీ పెట్టుబడులపై విమర్శలు ఎదుర్కొన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని భావిస్తోందని సమాచారం. రిస్క్‌ను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీల్లో తన రుణ, ఈక్విటీ పెట్టుబడులపై పరిమితులను విధించుకోవాలని యోచిస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో అదాని గ్రూపు దాదాపు 8 లక్షల కోట్లు నష్టపోయింది. అదానీ కంపెనీ షేర్లలో ఎల్‌ఐసి రూ.30వేల కోట్ల పెట్టుబడులు పెట్టగా, మరో రూ.6180 కోట్ల రుణాలు ఇచ్చింది. దీంతో ఎల్‌ఐసి తీవ్ర విమర్శల పాలు అయ్యింది. ఈ నేపథ్యంలో ఏ కంపెనీలో అయినా రుణ, ఈక్విటీ పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని ఆ సంస్థ యోచిస్తుందని రాయిటర్స్‌ వెల్లడించింది.