న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. జగన్నాథ్ నియమితులయ్యారు. ఆయన సోమవారం మార్చి 13 నుంచే ఎండి బాధ్యతలను చేపట్టారు. ఈయనకు మార్కెటింగ్‌లో మంచి అనుభవం ఉంది. జగన్నాథ్ 1988లో ఎల్‌ఐసిలో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా చేరారు. ఈయన కార్పొరేషన్‌కి సంబంధించిన విషయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్ సర్వీసెస్ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి ఎండిగా జగన్నాథ్‌ని నియమించింది. ఇక ఎల్‌ఐసి ఛైర్మన్‌గా ఉన్న ఎం.ఆర్.కుమార్ మార్చి 14వ తేదీకి తన పదవీకాలం పూర్తికానుంది. అయితే సిద్ధార్థ మొహంతిని ఎల్‌ఐసి తాత్కాలిక ఛైర్మన్‌గా మూడునెలల పాటు కొనసాగేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూన్‌లోగా ఛైర్మన్‌ని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.










