ఢిల్లీ :ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నికర లాభాలు నాలుగు రెట్లు పెరిగి రూ.1,188 కోట్లుగా నమోదయ్యాయి. ఎల్‌ఐసికి చెందిన ఈ సంస్థ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.305 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం త్రైమాసికంలో సంస్థ రెవెన్యూ 6,753 కోట్లుగా చోటు చేసుకుంది. వడ్డీ ఆదాయం రూ.6,707 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,049 కోట్ల వడ్డీ ఆదాయం నమోదయ్యింది.