న్యూఢిల్లీ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్)లో భాగంగా కంటి చికిత్సలకు సాయం చేయనున్నట్లు ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ తెలిపింది. 14,500 మందికి కంటి శుక్లాలను తొలగించడానికి మద్దతును అందించనున్నట్లు పేర్కొంది. దక్షిణాదిలో 4వేల శస్త్ర చికిత్సలకు సాయం చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించింది.''కరీన్ రోష్ని : లైట్ ఫర్ ఎవ్రీ సైట్'' నినాధంతో కంటి శుక్ల శస్త్రచికిత్సలకు మద్దతు ఇవ్వడానికి ఆరు చారిటేబుల్ ట్రస్ట్‌లతో భాగస్వామ్యం చేసుకున్నట్లు తెలిపింది.