Jul 03,2023 07:24

'మాకొద్దీ నల్లదొరతనం' అంటూ నినదించిన కవి కుసుమ ధర్మన్న పేరిట ఏర్పాటు చేసిన సాహిత్యసేవా పురస్కారాన్ని నవ మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీకి ప్రకటించారు. కలిమిశ్రీ గత 16 సంవత్సరాలుగా నవమల్లెతీగ మాసపత్రికను నిరాటంకంగా నడుపుతూ కొత్తతరం సాహితీవేత్తలను ప్రోత్సహించడంలో ముందడుగు వేస్తున్నారు. జులై 16న విజయవాడలో కుసుమ ధర్మన్న సాహితీ కళాపీఠం నిర్వహించే ప్రత్యేక సాహిత్య కార్యక్రమంలో కలిమిశ్రీ గారికి సాహితీసేవా పురస్కారాన్ని అందజేస్తాము. ఈ అవార్డుకు రూ.11,116 ల నగదుతో జ్ఞాపిక, శాలువాతో సత్కారం వుంటుంది.
- డా.రాధా కుసుమ, కుసుమ ధర్మన్న సాహితీ కళాపీఠం