Nov 28,2022 07:05

సాహిత్య అకాడెమి, కవి సంధ్య సంయుక్త నిర్వహణలో డిసెంబర్‌ 11 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రోజంతా హైదరాబాద్‌, రవీంద్ర భారతి సమావేశ మందిరంలో వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు శతజయంతి సాహిత్య సదస్సు జరుగుతుంది. ప్రారంభ సదస్సులో కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్‌, నందిని సిధారెడ్డి, శిఖామణి, కుందుర్తి కవిత పాల్గొంటారు. తర్వాత జరిగే సదస్సుల్లో శీలా సుభద్రాదేవి, సుధామ, సీతారాం, నాళేశ్వరం శంకరం, ఎన్‌.వేణుగోపాల్‌, యాకూబ్‌, పుప్పాల శ్రీరాం పత్ర సమర్పణ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ముగింపు సమావేశంలో నగముని, విహారి, చల్లా రామఫణి పాల్గొంటారు. ఈ సందర్భంగా కవి సంధ్య 39, కుందుర్తి శత జయంతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఉంటుంది.

- కె.శ్రీనివాసరావు, కార్యదర్శి
సాహిత్య అకాడమి.