Oct 21,2023 22:23

67బంతుల్లో 109పరుగులు
హెన్రిక్స్‌, డుస్సెన్‌, జెన్సన్‌ అర్ధసెంచరీలు
ఇంగ్లండ్‌పై 229పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా భారీ విజయం
ముంబయి: వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారింది. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ క్లాసెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగగా.. హెన్రిక్స్‌, డుస్సెన్‌, జెన్సన్‌ అర్ధసెంచరీలతో మెరిసారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్లకు 399 పరుగుల భారీస్కోరు సాధించింది. ఛేదనలో ఇంగ్లండ్‌ 22 ఓవర్లలో 170పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 229పరుగుల తేడాతో నెగ్గి ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల తేడాతో నెగ్గిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. అలాగే ఇంగ్లండ్‌ జట్టు ఇన్ని పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలవ్వడం ఇదే ప్రథమం. తొలుత ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(4) వికెట్‌ను త్వరగా కోల్పోయి దక్షిణాఫ్రికా.. 2వ వికెట్‌కు హెన్రిక్‌, డుస్సెన్‌ కలిసి 121పరుగులు జతచేశారు. సఫారీ ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌తో మొదలుపెడితే, చివర్లో జాన్సన్‌ వరకు ఉతికారేశారు. వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ వీర మాస్‌ సెంచరీ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. క్లాసెన్‌ 67బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. టోప్లేకు మూడు, మార్క్‌వుడ్‌, రషీద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు తొలినుంచే చేతులెత్తేసింది. టాప్‌, మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ అందరూ చేతులెత్తేయగా.. చివర్లో అట్కిన్సన్‌(35), మార్క్‌ వుడ్‌(43) బ్యాట్‌ ఝుళిపించారు. కోర్ట్జేకు మూడు, ఎన్గిడి, జెన్సన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ క్లాసెన్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి)బట్లర్‌ (బి)టోప్లే 4, హెన్రిక్స్‌ (బి)ఆదిల్‌ రషీద్‌ 85, డుస్సెన్‌ (సి)బెయిర్‌స్టో (బి)రషీద్‌ 60, మార్‌క్రమ్‌ (సి)బెయిర్‌స్టోర్‌ (బి)టోప్లే 42, క్లాసెన్‌ (బి)అట్కిన్సన్‌ 109, డేవిడ్‌ మిల్లర్‌ (సి)స్టోక్స్‌ (బి)టోప్లే 5, జెన్సన్‌ (నాటౌట్‌) 75, కోర్ట్జే (సి)లివింగ్‌స్టోన్‌ (బి)అట్కిన్సన్‌ 3, మహరాజ్‌ (నాటౌట్‌) 1, అదనం 15. (50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 399పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/125, 3/164, 4/233, 5/243, 6/294, 7/398
బౌలింగ్‌: టోప్లే 8.5-0-88-3, డేవిడ్‌ విల్లీ 9-1-61-0, రూట్‌ 6.1-0-48-0, అట్కిన్సన్‌ 9-0-60-2, మార్క్‌ వుడ్‌ 7-0-76-0, ఆదిల్‌ రషీద్‌ 10-0-61-2.
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి)డుస్సెన్‌ (బి)ఎన్గిడి 10, మలన్‌ (సి)డికాక్‌ (బి)జెన్సన్‌ 6, రూట్‌ (సి)మిల్లర్‌ (బి)జెన్సన్‌ 2, స్టోక్స్‌ (సి అండ్‌ బి) రబడా 5, బ్రూక్‌ (ఎల్‌బి)కొర్ట్జే 17, బట్లర్‌ (సి)డికాక్‌ (బి)కొర్ట్జె 15, డేవిడ్‌ విల్లీ (సి)రబడా (బి)ఎన్గిడి 12, ఆదిల్‌ రషీద్‌ (సి)హెన్రిక్స్‌ (బి)కొర్ట్జే 10, అటిన్సన్‌ (బి)మహరాజ్‌ 35, మార్క్‌వుడ్‌ (నాటౌట్‌) 43, టోప్లే (ఆబ్సెంట్‌) 0, అదనం 15. (22ఓవర్లలో) 170పరుగులకు ఆలౌట్‌.
వికెట్ల పతనం: 1/18, 2/23, 3/24, 4/38, 4/67, 5/67, 6/68, 7/84, 8/100, 9/170, 10/170
బౌలింగ్‌: ఎన్గిడి 5-1-26-2, జెన్సన్‌ 5-0-35-2, రబడా 6-1-38-1, కొర్ట్జే 4-0-35-3, మహరాజ్‌ 2-0-27-1.