Sep 15,2023 22:22

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌
సెంచూరియన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో వన్డేలో దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ హెన్రిక్‌ క్లాసెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 83 బంతుల్లో 13ఫోర్లు, 13సిక్సర్ల సాయంతో ఏకంగా 174పరుగులు చేశాడు. డుస్సెన్‌(62), డేవిడ్‌ మిల్లర్‌(82నాటౌట్‌) కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 416పరుగులు చేసింది. ఆడం జంపా 10 ఓవర్లలో 113పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. దక్షిణాఫ్రికా జట్టు మూడో వన్డేలో 111 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.