May 31,2023 20:49

ముంబయి : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా క్రితివాసన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ హోదాలో పని చేసిన రాజేష్‌ గోపినాథన్‌ ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. టిసిఎస్‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని.. తనకు సహకరించిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సిబ్బందికి ఆయన ఓ లేఖ రాశారు. ఆరేళ్లు సిఇఒగా బాధ్యతలు నిర్వర్తించడం గర్వంగా ఉందన్నారు.