అహ్మాదాబాద్ : కొరియాకు చెందిన ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్‌తో ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కొరియన్ బ్యాంక్ నుంచి 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2400 కోట్లు) రుణ మద్దతును పొందనుంది. కొరియన్ ఎగ్జిమ్‌బ్యాంక్‌తో చేసుకున్న ఒప్పందం భారత్, కొరియా మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు మద్దతు ఇస్తూ మరింత బలోపేతం కావడానికి దోహదం చేయనుందని ఆ బ్యాంక్ పేర్కొంది.










