Nov 29,2022 15:27

ప్రజాశక్తి - చందర్లపాడు (ఎన్‌టిఆర్‌ జిల్లా) : ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి త్రో బాల్‌ సెలక్షన్స్‌లో అండర్‌-14, అండర్‌-17 విభాగాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టుకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కొండపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు బి.సీతారాం తెలిపారు. అండర్‌-14 విభాగంలో యం.స్ఫూర్తి 6వ తరగతి, యన్‌.ఇందు 6వ తరగతి, సి.హెచ్‌.శ్రీలక్ష్మి 7వ తరగతి, కె.విజయకుమార్‌ 7వ తరగతి, అండర్‌ 17 విభాగంలో ఎ.అరుణకుమారి 9వ తరగతి, ఎమ్‌.రాజా 10వ తరగతి ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ సనకా రామారావును ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ చావల రవిబాబు, గ్రామ పెద్దలు కందుల.నాగేశ్వరావు, ఎస్‌ఎమ్‌సి చైర్మన్‌ బి.ఏడుకొండలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.