Oct 28,2022 09:29
Kommineni-Srinivasa-Rao-as-the-Chairman-of-the-Press-Academy

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978 నుంచి జర్నలిజంలో వున్నారు. ఈనాడు పత్రికలో వివిధ హోదాల్లో దాదాపు 24 సంవత్సరాలపాటు పనిచేశారు. 2002లో ఆంధ్రజ్యోతి దినపత్రిక పున:ప్రారంభం అయినపుడు బ్యూరోచీఫ్‌గా పనిచేశారు. 2007 నుంచి ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న శ్రీనివాసరావు ఎన్‌ టివి తర్వాత సాక్షిలో చేరారు. ప్రస్తుతం సాక్షి టివిలో పొలిటికల్‌ డిబేట్లకు వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియామక ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం వున్నట్లు సమాచారం.