ప్రజాశక్తి-రేపల్లె (బాపట్ల) :డిగ్రీ కళాశాలలకు గ్రేడ్‌ను ప్రతిపాదించే జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ(ఎన్.సి.సి) తరపున ముగ్గురు కమిటీ సభ్యుల బృందం ఏబిఆర్ డిగ్రీ కళాశా కళాశాలను పరిశీలించినట్లు ఏబిఆర్ డిగ్రీ కళాశా కళాశాల ప్రిన్సిపాల్ రవిచంద్ర కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమలో భాగంగా కమిటీ సభ్యులు కళాశాల ఐక్యూఏసి ఎన్.సి.సి మహిళా సాధికారత విభాగం కేరీర్ గైడాన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ క్రీడా ప్రాంగణం, విధార్ధులకు అందుతున్న ఉపకార వేతనాలను పరిశీలించారు. కమిటీ సభ్యులు కళాశాల అభివృద్ధి గురించి వారి సలహాలు, సూచనలను రిపోర్ట్ లో పొందుపరిచారు. వీడ్కోలు సభలో కమిటీ సభ్యులకు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బందం మరియు విధ్యార్ధినీ, విధ్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు. ఏబిఆర్ ప్రభుత్వకళాశాల మంచి నాక్ గ్రేడ్ సాధిస్తుంది అని ప్రిన్సిపల్ టి.సి. రవిచంద్ర కుమార్ ఆశా భావం వ్యక్తం చేశారు.










