గాలిపటమా ! ఎగురవే
నీలినింగిని తాకవే
గద్దలే నిను తాకబోగా
ముద్దులాడుచు ఎగురవే !
మబ్బులతో దోబూచులాడవే
మనసులను మురిపించవే
మనుషులే అడ్డగించినా
మునుముందుకే తరలవే!
విహంగంలా ఎగురవే
వినువీథిన విహరించవే
వన్నెచిన్నెలు చూపుచూ
చిన్నారులను అలరించవే !
చెట్టుకొమ్మల చిక్కకే
చిక్కులు తెచ్చిపెట్టకే
చిన్నిబాలలు చిందులేసేలా
ఉన్నచోటనే ఊయలూగవే!
- చంద్రకళ దీకొండ,
మేడ్చల్










